మనం ఎం తింటున్నాం అనే దానికన్నా మనం ఎంత జీర్ణం [Jeerna Vyavastha] చేసుకోగలుగున్నం అనేదాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. మనం ఎంత జీర్ణం చేసుకోగలం అనేది మన ఎనర్జీ లెవల్, మనం వయసు, ఫిజికల్ మరియు మెంటల్ హెల్త్ పై ఆధారపడి ఉంటుంది. కానీ చాలా మంది ప్రజలు తెలిసో తెలియకో ప్రతి రోజు తప్పులు చేస్తూ ఉంటారు, వాటి వల్ల వాళ్ళ జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. దీని వల్ల గ్యాస్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, జీర్ణం కాకపోవడం మరియు చర్మ సమస్యలు అలాగే జుట్టు రాలిపోవడం వంటివి జరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం 90% రోగాలు ఉదర సమస్యలతోనే వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం జీర్ణ వ్యవస్థ ను ఎలా మెరుగుపరుచుకోవాలో? ఏవి తింటే మన జీర్ణ వ్యవస్థ కి మంచిది? ఏవి తింటే మంచిది కాదో తెలుసుకుందాం.
తిన్న ఆహరం సరిగా జీర్ణం అవుతుంటే! మనం ఆరోగ్యాంగా ఉన్నాం అని అర్ధం. చాలా మందికి వారి రోజువారీ అలవాటు వల్ల జీర్ణ వ్యవస్థ పాడయిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం జీర్ణ వ్యవస్థ పాడవడానికి 5 కారణాలు గురించి, అలానే జీర్ణ వ్యవస్థ మెరుగుపడడానికి 5 కారణాలు.
జీర్ణవ్యవస్థకు హానికరమైన టాప్ 5 చెడు అలవాట్లు
1. తిన్న తర్వాత స్నానం చేయడం వలన జీర్ణ సమస్య

చాలా మంది ఆఫీస్ నుంచి వచ్చాక ముందుగా తినేసి తర్వాత స్నానం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఉదయం పూట కూడా టిఫిన్ తినేసి స్నానం చేస్తూ ఉంటారు, ఇలా చేయడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ ఖచ్చితంగా పాడవుతుంది. ఇలా ఎందుకు పాడవుతుంది అంటే మీరు తిన్న వెంటనే మన శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణం అవ్వడానికి శరీరం లో వేడి పెరుగుతుంది. కానీ తిన్న తర్వాత స్నానం చేయడం వలన మన శరీరం చల్లపడిపోయి తిన్న ఆహరం సరిగా జీర్ణం అవ్వదు. ఈ విదంగానే చాలా మంది తిన్న వెంటనే నీళ్లు తాగుతుంటారు, ఇలా తాగడం వల్ల తిన్న ఆహరం స్లో గా జీర్ణం అవుతుంది. అందువలన జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఎప్పుడైతే తిన్న ఆహరం సరిగా జీర్ణం అవ్వదో అది వ్యర్థ పదార్థం [టాక్సిన్స్] గా మారుతుంది. అందుకే ఎప్పుడైనా సరే తిన్న వెంటనే నీళ్లు తాగకండి. తిన్న 30 నిమిషాల తర్వాత నీళ్లు తాగడానికి ప్రయత్నించండి. అలాగే తినక ముందే స్నానం చేయడానికి ప్రయత్నించండి.
2. వేరు వేరు ఆహారాన్ని కలిపి తినడం వలన జీర్ణ సమస్య

చాలా మంది తెలియక ఆహారాన్ని తప్పుడు కాంబినేషన్ తో తింటూ ఉంటారు, ఇలా చేయడం వలన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయక అది టాక్సిన్స్ గా మారుతుంది. ఉదాహరణకు: పాలతో పాటు ఫ్రూప్ట్స్ తినడం, టీ ని సాల్టీ ఫుడ్ తో తీసుకోవడం మరియు తిన్న తర్వాత టీ తాగడం. ఇలా చేయడం వలన మీ జీర్ణ వ్యవస్థ పూర్తిగా పాడవుతుంది. మీకు ముందుగానే జీర్ణ వ్యవస్థ సమస్య ఉంటె! పాలతో చేసిన దలియా, అరటిపండు మరియు మాంగో షేక్ ని దూరం ఉంచండి. అంతేకాకుండా సూర్యాస్తమయం తర్వాత ఫ్రూట్ సలాడ్ కూడా తినకండి. ఎందుకంటే ఈ ఆహారాలు తినడం వలన మీ జీర్ణ వ్యవస్థ స్లో గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఒకేసారి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తినడం వలన శరీరం లో వేడి పెరిగి జుట్టు రాలిపోయే సమస్య కూడా వస్తుంది. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ని తింటుంటే మీ జీర్ణ వ్యవస్థ ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండదు. ఫాస్ట్ ఫుడ్స్ ని తినడం వలన అది మన జీర్ణ వ్యవస్థ లో అతుక్కుని పోయి చాలా సమస్యలని తెస్తుంది. అందుకే ఇంట్లో ఫాస్ట్ ఫుడ్స్ కి బదులు పాస్తా వంటి వాటిని తినడానికి ప్రయత్నించండి. అలాగే ఫ్రెష్ మరియు సీసనల్ పండ్లని తినండి. పండ్లని ఉదయానే లేదా మధ్యాహ్నం భోజనం చేయక ముందు తింటే దాని నుండి ఫైబర్ లభిస్తుంది. దాని వళ్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
3. వారం రోజుల పాటు ఆహారాన్ని నిల్వ ఉంచుకొని తినడం

ఇప్పుడు ఉన్న కాలం లో ముందు గానే 1 లేదా 2 రోజుల కి ఒకేసారి ఆహారం ని రెఢీ చేస్కొని ఫ్రీడ్జ్ లో స్టోర్ చేసుకుంటున్నారు, ఇలా స్టోర్ చేసుకున్న ఆహారం తినడం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక్కొక్క ఆహారనికి ఒక్కొక్క ఎక్స్ పైర్ డేట్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్ పైర్ డేట్ ని స్టోర్ చేయడం వలన ఆపవచ్చు అనుకుంటే అది మీ అపోహ అని చెప్పవచ్చు. మీరు ఒక ఆహారాన్ని స్టోర్ చేయడం వలన అందులో ఉండే ప్రోటీన్ మరియు న్యూట్రీషన్ మొత్తం కోల్పోతుంది. అంతే కాకుండా అందులో మనకి కనపడని క్రిములు కూడా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఇలాంటి ఆహారాలాని పాచిపోయింది అంటారు. ఇలాంటి ఆహారాలు తినడం వలన మన శరీరం లో టోక్సిన్స్ ని ఏర్పరుస్తుంది, ఆయుర్వేదం ప్రకారం వేడి వేడి గా ఫ్రెష్ గా ఉన్న ఆహారాలు తినడం చాలా మంచిది.ఆహారం ఫ్రెష్ గా ఉండడం వలన మంచిగా జీర్ణం కూడా అవుతుంది, అలాగే మంచి పోషకాలను కూడా అందిస్తుంది. కానీ కొంత మంది అనుకోవచ్చు “నేను చాలా కాలం నుంచి ఇలానే తింటున్నాను నాకు ఎలాంటి సమస్యలు రాలేదు అని” అలా ఎందుకు రాలేదు అంటే! మీ జీర్ణ శక్తి మెరుగ్గా ఉండవచ్చు. మన శరీరం లో డైజెస్టీవ్ శక్తి 16 సంవత్సరాలకి పెరుగుతుంది, 16 నుండి 35 సంవత్సరాల వరకు స్థిరంగా ఉంటుంది, కానీ 35 సంవత్సరాల తర్వాత తగ్గుతూ వస్తుంది. కాబట్టి యవ్వన వయస్సులో ఉండడం వలన ఎలాంటి సమస్య రాకపోవచ్చు, కానీ ముందు ముందు అది పెద్ద సమస్య గా మారే అవకాశం ఉంది.
4. ఒత్తిడి వలన ఆహారం జీర్ణం కాకపోవడం

మీరు ఎప్పుడైనా గమనించారా? ఎక్కువ ఆందోళన కలిగినప్పుడు మీ కడుపు పాడవుతుంది అని! ఎప్పుడైనా మనం ఒక్కసారిగా బయపడినా కూడా అలా జరుగుతుంది. ఇలా ఎందుకు అంటే మీ మైండ్ కి డైరెక్ట్ కనెక్షన్ మీ పొట్టతో ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా గమనించారా మీ పొట్ట కాళీ అయినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని! అదే మీ పొట్ట క్లీన్ అవ్వకపోతే అంతే చిరాకుగా కూడా ఉంటుంది. ఎందుకంటే బ్రైన్ మరియు గట్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఈ తేడాలు ఉంటుంది. ఈ కాలం లో స్ట్రెస్ [ఆందోళన] అనేది ఒక సామాన్య విషయంగా మారింది, ఉదాహరణకు: exams మరియు ఎక్కువగా ఫోన్ వాడడం వంటి మొదలైన వాటి వలన ఎక్కువ గా స్ట్రెస్ కి గురవుతారు. అందుకనే ఎక్కువగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. నేచర్ తో దగ్గర గా ఉండండి మరియు వ్యాయామం వంటివి చేయడానికి ప్రయత్నించండి.
5. సమయం పాటించనకుండా [ఎప్పుడు పడితే అప్పుడు] ఆహారం తినడం

ఈ బిజీ కాలం లో ప్రజలు సరైన సమయాని బోజనం చేయడం లేదు అంతే కాకుండా ఏది పడితే అది ఏ సమయం లో పడితే ఆ సమయం లో తినడం చేస్తుంటారు. ఇలా తినడం వలన మన శరీరానికి చాలా ప్రమాదం. అంతే కాకుండా తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణం అవ్వక టోక్సిన్స్ గా మారుతుంది. అందుకే ఎప్పుడైనా సరే బోజనం తినడానికి ఒక సమయం అనేది ఏర్పరుచుకోండి. ఉదయం, మద్యాహనం మరియు రాత్రి ఒక సమయం ని ఏర్పరుచుకోండి. ఒక్కొకససరి లేట్ అయినా పర్లేదు. కానీ తింటున్నప్పుడు నెమ్మదిగా బాగా నమిలి తినండి. మన జీర్ణ వ్యవస్థ ఎలా తయారు అయ్యింది అంటే! 50% మన నోటి లోనే కంప్లీట్ అయిపోవాలి. అంటే మనం తినీ ఆహారం దాదాపు శాస్త్రీయంగా 32 సార్లు నమలాలి. చాలా మంది సరిగా నమిలి తినక తిన్న ఆహారం నుంచి మంచి శక్తి ని గ్రహించ లేకపోతున్నారు. అంతే కాకుండా మన జీర్ణ వ్యవస్థకు ఎక్కువ పని పెట్టినట్లు అవుతుంది. అందుకే తినే ఆహారం బాగా నమిలి తినండి.
ఈ 5 చెడు పద్దతులని కచ్చితంగా మార్చుకోండి, మీ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుచుకోండి.
జీర్ణవ్యవస్థకు మేలు చేసే టాప్ 5 మంచి అలవాట్లు
1. రకరకాల గీజలను తినడం వలన జీర్ణ వ్యవస్థ ను మెరుగుపరుచుకోండి

మీరు మీ జీర్ణ వ్యవస్థ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే! ధాన్యాలను మార్చి మార్చి తినండి. అంటే ఉదయం , మద్యాహ్నం మరియు రాత్రి భోజనం లేదా టిఫిన్ మాత్రమే కాకుండా దానితో పాటు కొంచెం వెరైటీ వి కూడా తినవచ్చు, మీరు అప్పుడప్పుడు బేసిన్ సీర, పెసరట్టు, ఓట్స్, మిల్లెట్స్ వంటివి తినండి. ఇవి తినడం వలన వేరు వేరు ఆరోగ్యకరమైన న్యూట్రియన్స్ మన శరీరానికి లభిస్తుంది. అంతే కాకుండా ఫైబర్స్ తో పాటు ప్రీ బయోటిక్ కూడా లభించి మీ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసేలా చేస్తుంది.
2. రోజు ప్రొ బయోటిక్ ఆహారం ఉన్న పదార్దాలను తినడం

ప్రొ బయోటిక్ ఎక్కువ ఉన్న ఆహారాలను తినడం, ఎవరికైతే తక్కువ జీర్ణ శక్తి ఉంటుందో వాళ్ళలో ప్రొ బయోటిక్ అనేది తక్కువ గా ఉంది అని అర్ధం. ప్రొ బయోటిక్స్ అనేవి మంచి బాక్టీరియా, ఇవి మన జీర్ణ వ్యవస్థను స్ట్రాంగ్ గా చేస్తాయి, అంతే కాకుండా హానికరమైన క్రిములని కూడా తొలగిస్తుంది. ప్రొ బయోటిక్ ఎక్కువ ఉన్న ఆహారాలు మన రోజువారీ ఆహారాలలో ఉండడం చాలా ముఖ్యం. ప్రొ బయోటిక్ కోసం బయట రెడీమేడ్ సప్లిమెంట్స్ తీస్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందులో బాక్టీరియా కంటే ఎక్కువగా పంచదార ఉంటుంది. మీరు మీ ఇంటి దగ్గరే పేరుగులో బెల్లం పొడి ని వేసుకొని బాగా కలిపి బ్రేక్ఫాస్ట్ కి ముందు తినండి. ఇందులో మంచి బాక్టీరియా లు ఉంటాయి.
3. నెయ్యి తీస్కోవడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడడం

మీరు రోజు తినే ఆహరం లో మన దేశీయ నెయ్యి లేకపోతె మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు: ఎసిడిటీ, బ్లోటింగ్, గ్యాస్, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెయ్యి తినడం వల్ల అందులో ఉండే బుట్రిక్ ఆసిడ్ మన కడుపుని మరియు ప్రేగులను ఆరోగ్యాంగా స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది, ఈ శరీర అవయవాలు ఆరోగ్యాంగా ఉండడం వలన మన తిన్న ఆహరం లో నుంచి న్యూట్రిఎంట్స్ ని గ్రహించుకుంటుంది. అంతేకాకుండా వ్యర్థ పదార్దాలను కూడా బయటకు పంపుతుంది. ఈ నెయ్యి వలన మన ప్రేగులలో ఉండే వ్యర్థాలను బయటకు పంపేలా చేస్తాయి. అందుకే మీరు రోజు తినే ఆహారాలలో 2 నుండి 4 చెంచాలు నెయ్యి ఉండేలా చూస్కోండి. ఉదాహరణకు : చపాతీలో, కూరలో, మరియు అన్నం లో కూడా నెయ్యి వేసుకోడానికి ప్రయత్నించండి.
4. మంచిగా నిద్రపోవడం

మీరు ఎప్పుడైనా గుర్తించారా మంచి నిద్రలో నుంచి లేవగానే టాయిలెట్ వస్తూ ఉంటుంది. రాత్రి పూట పాడుకొనే నిద్ర మన జీర్ణ వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజుల్లో చాలా మంది రాత్రి పూట సరిగా నిద్రపోవడం లేదు, రాత్రి పూట సరిగా పడుకోవడం వలన మీ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. నిద్ర లో ఉన్నప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది. మీకు తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకుండా ఉంటె రాత్రి పూట కచ్చితంగా 6 నుంచి 8 గంటలు పడుకోండి. అంతేకాకుండా ముఖ్యంగా ఎడమ వైపు తిరిగి పాడుయాకోవడం ముఖ్యం. ఇలా పడుకోవడం వలన ఆసిడ్స్ అనేవి రిలీజ్ అవ్వవు. కాబట్టి రాత్రి పూట ఖచ్చితంగా మంచిగా పడుకోండి.
5. యోగా చేయడం మరియు ఆసనాలు వేయడం

జీర్ణ శక్తీ పెంచుకోడానికి ఆయుర్వేదం లో చాలా టెక్నిక్ లు ఉన్నాయి. మీకు జీర్ణ శక్తీ తక్కువ గా ఉంటె ఆహారం తినే ముందు అల్లం ముక్కతో కొంచెం ఉప్పు ని తీసుకోండి. ఇలా తినడం వలన మీ జీర్ణ శక్తీ పెరుగుతుంది. ఇంకా కుడి ముక్కుతో గాలి పీల్చుకునే ఆసనం దీనినే సూర్యభేది పప్రాణాయము అని కూడా అంటారు. దీనిని కుడి ముక్కుతో గాలి పీల్చుకొని ఎడమ ముక్కుతో గాలి వదలడం. దీనిని తినబోయే 10 నిమిశాల ముందు ఒక 8 నుంచి 10 సార్లు చేస్తే చాలు. అంతేకాకుండా ఆహరం తిన్నాక సోంపు తినడం వలన కూడా మీ జీర్ణ వ్యవస్థ పెరుగుతుంది. అందుకే సోంపు ని ఎప్పుడు మీతో ఉంచుకోండి. ఇంకా తిన తర్వాత వజ్రాసనం కూడా చేయవచ్చు, దీని వలన మీ జీర్ణ శక్తీ పెరుగుతుంది.
Conclusion
ఈ విధంగా ఈ పద్ధతులు పాటించడం వలన మీ జీర్ణ శక్తి ని పెంచుకోవచ్చు. పైన చెప్పిన విధంగా ఆ బాడ్ హబిట్స్ ని దూరం చేసి గుడ్ హబిట్స్ ని అలవాటు చేసుకోండి. ఈ జీర్ణ వ్యవస్థ సమస్య వున్నవాళ్లు చాలా ఇబ్బంది పడుతుంటారు కావున ఇప్పుడు చెప్పిన పద్దతులను పాటించండం వలన మీ జీర్ణ వ్యస్థ శక్తీ పెరిగి మీరు తిన్న ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది. బయట చేడు ఆహారాలు తినకుండా ఇంట్లో చేసుకొని తినండి ఆరోగ్యాంగా ఉండండి! ధన్యవాదాలు…

నా పేరు చైతన్య. నేను ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్నాను. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది జంక్ ఫుడ్ మరియు బయట ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. ఈ పరిస్థితిని చూసిన తర్వాత, నిజమైన ఆరోగ్యమే నిజమైన సంపద అనే విషయాన్ని అర్థం చేసుకున్నాను. ఆరోగ్యంగా ఉండేందుకు మనం ఎలా జీవించాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే విషయాలను నేర్చుకుంటూ, వాటిని మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా నిస్సంకోచంగా వాటిని అనుసరించి ఆరోగ్యంగా జీవించవచ్చు. [గమనిక : మీకు మరింత ఎక్కువగా మీ ఆరోగ్యం ప్రమాదం లో ఉంది అనిపిస్తే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి]