బరువు పెంచుకోవడానికి డైట్ ప్లాన్: ఉదయం నుంచి రాత్రి వరకు ఏం తినాలి? | Weight Gain Tips in Telugu

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏం తినాలి ? ఎం తినకూడదు? బరువు పెరగడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకునే డైట్ శులభంగా ఉంటుంది శాస్త్రీయంగా కూడా ఉంటుంది. ఇప్పుడు బరువు పెరగడానికి చెప్పుకునే డైట్ ని కచ్చితంగా ఒక 15 రోజులైనా పాటిస్తే మీరే శరీరం లో తేడాని గమనిస్తారు.

బరువు పెంచుకోవడానికి ఉదయం చిట్కాలు

Health weight gain tips

ఉదయం లేవగానే నీళ్లు తాగండి. కచ్చితంగా 2 – 3 గ్లాస్ నీళ్లు తాగండి. నార్మల్ నీళ్లు తాగిన మంచిదే , లేకపోతే గోరు వెచ్చని నీళ్లు తాగితే మంచిది. తర్వాత ఫ్రెష్ అయ్యాక ఆయిల్ పుల్లింగ్ చేయండి. ఆయుర్వేదం ప్రకారం ఎవరి శరీరం అయితే లోపల నుంచి డ్రై అయిపోతుందో వాళ్ళు బరువు పెరగలేరు. వాళ్ళకి ఆయిల్ పుల్లింగ్ చిట్కా బాగా పనిచేస్తుంది.

తర్వాత బ్రెష్ చేసి బ్రేక్ఫాస్ట్ కి రెడీ అవ్వండి. బరువు పెరగాడిని ఆహారాన్ని అధికంగా తినాల్సిన అవసరం లేదు, ఆహారాన్ని దానికి సరిపడా కాంబినేషన్ తో తింటే చాలు. బ్రేక్ఫాస్ట్ లో మైదా మరియు వైట్ బ్రేడ్స్ అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి తినడం వలన పొట్ట పెరుగుతుంది.

మిల్క్ దలియా ని గోధుమలు లేదా ఓట్స్ తో తినండి.

దానితో పాటు మీరు 5 నానబెట్టిన బాదాం ని తినండి.

అప్పుడప్పుడు ఈ దలియా ని నెయ్యి తో రోస్ట్ చేసి సీజన్లో దొరికే కూరగాయలతో తినొచ్చు.

మూంగ్ దళ్ దోస లో బంగాళాదుంప లేదా పనీర్ వేసుకొని తినొచ్చు.

పరాఠా ఇష్టమైతే పెరుగు లేదా వెన్న తో తినండి.

హోల్ వీట్ బ్రెడ్ sandwiched కూడా తొనొచ్చు.

శనగలు మరియు గ్రుడ్లు కూడా తినొచ్చు. లేదా పరాఠా ని గ్రుడ్లు బురిజి తో తినొచ్చు. లేదా పనీర్ బురుజి ని కూడా తినొచ్చు.

Fruits Eating Tips

తిన్న 2 గంటల తర్వాత మధ్యలో స్నాక్ లాగ ఫ్రూట్స్ తింటే మంచిది. సీసనల్ గా దొరికే ఫ్రూట్స్ ని ఎక్కువ తినండి. ఎందుకంటే సీసనల్ పండ్లలో మన శరీరానికి సరిపడా పోషకాలు ఉంటాయి. లేదా అరటి పండు ని తినండి లేకపోతే ఖర్జురా ని కూడా తినొచ్చు. ఎక్కువ గా ఆకిలిగా ఉంటె పాలు కూడా తాగొచ్చు. ఇంకా బననా పీనట్ బటర్ రోటి ని కూడా తినొచ్చు. ఉడికించిన శనగలను కూడా తినొచ్చు.

బరువు పెరగడానికి మద్యాహ్నం పూట తినాల్సిన ఆహార చిట్కాలు

మధ్యాహ్న భోజనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడు చేసుకునే విదంగానే 2 రోటి తో పాటు అన్నం మరియు ఎదో ఒక కూరగాయల కూర లేదా పప్పు తో తినండి. ఆయుర్వేదం ప్రకారం బరువు పెరగడానికి శులభమైన చిట్కా ఏంటి అంటే? రోటి తో పాటు అన్నం ని ఒకేసారి తినండి. అందుకే మధ్యాహ్న భోజనం లో రోటి మరియు అన్నం రెండు ఉండేలా చూసుకోండి. ఇంకా రోటి లలో కూరగాయలలో నెయ్యి కూడా వేసుకోవచ్చు. చోలే , నల్ల శనగలు, రాజ్మా, బ్లాక్ దళ్ మరియు పనస కూర ఇవి తినడం వలన మీరు బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. మీరు నాన్ వెజిటేరియన్ అయితే రోటి తో మరియు అన్నం తో పాటు కోడి మాంసం లేదా చేప కూర తినొచ్చు. తిన్న తర్వాత బట్టర్ మిల్క్ తప్పకుండ తాగండి, అందులో నల్ల మిరియాలు, కొంచెం కళ్ళు ఉప్పు, జీలకర్ర ను వేసుకోండి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగడం వలన మీ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అలాగే బరువు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు పటిక బెల్లం తో స్వీట్ లస్సి ని కూడా తాగండి. మీరు తిన్న తర్వాత పడుకోవాలని ఉంటె కచ్చితంగా 30 నిమిషాల కన్నా ఎక్కువ పాడుకోకండి, అంతే కాకుండా ఎడమవైపు తిరిగి పడుకోండి.

బరువు పెరగడానికి సాయంత్రం పూట తినాల్సిన ఆహారపు చిట్కాలు

Healthy foods for weight gain in Telugu

సాయంత్రం పూట స్నాక్ గా ఏదంటే అది తినేస్తూ ఉంటాం, ఉదా: సమోసా, బర్గర్, ఫ్రైడ్రైస్ వంటివి తింటూ ఉంటాం. ఇవన్నీ హై క్యాలోరీ ఆహారాలే, అవి బరువు కూడా పెరుగుతారు, కానీ అది హెల్తీ బరువు కాదు, కేవలం పొట్ట వస్తుంది మరియు క్రొవ్వు పెరుగుతుంది అంతే, అందుకే వీటిని అప్పుడప్పుడు మాత్రమే తినడానికి ట్రై చేయండి. ఈ ఆహారాలు వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యకరమైన సాయంత్రం పూట స్నాక్స్ గురించి చెప్తాను వాటిని తినడానికి ట్రై చేయండి. మీరు వేపిన శనగలతో పాటు రోస్ట్ చేసిన వేరుశనగలు తినొచ్చు, లేదా ఏదైనా సీసనల్ గా దొరికే పండ్ల ను తినొచ్చు. ఉదా : మామిడిపండు , బననా మిల్క్ షేక్స్ , అరటిపండు ను కట్ చేసుకొని అందులో పెరుగు కలుపుకొని కొంచెం మిరియాల పొడి వేసుకొని తినొచ్చు, చనా చాట్ మరియు బననా పీనట్ బట్టర్ రోటి ని కూడా తినొచ్చు, బ్రెడ్ ఓంప్లెట్ కూడా తినొచ్చు. సాయంత్రం పూట స్నాక్స్ గా ఈ ఆహారాలు తీసుకోవడం వలన ఆరోగ్యకరమైన బరువు పెరుగుతారు.

వర్కౌట్ చేయడం

Workout tips for weight gain in Telugu

తొందరగా బరువు పెరగాలి అంటే కచ్చితంగా వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేయడం వలన మీరు తిన్న ఆహరం సరిగా వంట పడుతుంది. వర్కౌట్ తర్వాత ప్రోటీన్స్ తీసుకోడానికి ట్రై చేయండి.

బరువు పెరగడానికి రాత్రి పూట తినాల్సిన ఆహారపు చిట్కాలు

రాత్రి పూట భోజనం లో కూడా అన్నం మరియు రోటి తో పాటు పప్పు కర్రీ లేదా ఏదైనా వెజిటేబుల్ కూర ని తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తుపెట్టుకోండి.

  • మధ్యాహ్నం భోజనం కన్నా రాత్రి భోజనం తక్కువ ఉండేలా చూసుకోండి.
  • అన్నం వండుకునేటప్పుడు అందులో మిరియాలు మరియు బిర్యానీ ఆకులను తప్పకుండా వేసుకోండి.
    రాత్రి పూట పెరుగు , అరటిపండు, ముల్లంగి, కీరా వంటివి అస్సలు తినకండి. మీరు తినే ఆహరం లో నెయ్యి ని తినొచ్చు.

పడుకొనే ముందు ఈ పని కచ్చితంగా చేయండి

మీరు పడుకునే 30 నిమిషాల ముందు బరువు పెరగడానికి ఏదైనా తినాలి అని అనుకుంటే ఒక గ్లాస్ పాలలో ఒక స్పూన్ అశ్వగంధ పొడి ని వేసుకొని తాగండి. అశ్వగంధ లేకపోతే తేనే, పటికబెళ్ళం, పసుపు ని వేసుకొని తాగొచ్చు. ఆయుర్వేదం ప్రకారం బరువు పెరగడం కోసం గేదె తో తాయారు అయినా పాలు , నెయ్యి వంటివి గేదె ద్వారా తీసుకోండి. ఇది బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. గేదె పాలు దొరకక పోతే ఆవు పాలు ని కూడా తాగొచ్చు.

ముగింపు

ఈ విధంగా మీరు పాటించడం వలన కచ్చితంగా బరువు పేరుగుతారు. ఇంకా మీరు బాడీ మస్సాజ్ చేసుకోవడం వాళ్ళ కూడా చాల లాభాలు ఉన్నాయి. ఇది ఉదయం లేదా సాయంత్రం పూట చేసుకోండి. ఈ బాడీ మస్సాజ్ ని నువ్వుల నూనె తో చేసుకోండి. ఇంకా మీరు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే? , రోజంతా నీళ్ల ని కొద్దీ కొద్దిగా తాగుతూ ఉండండి, రోజుకి 7 నుంచి 8 గంటలు మంచి నిద్రపోండి అప్పుడే మీరు చేసిన వర్కౌట్ యొక్క ఉంటుంది. మీరు ఈ డైట్ ప్లాన్ 15 రోజులు క్రమం తప్పకుండ పాటించినట్లు అయితే మీరు కచ్చితంగా బరువు పెరగడం గమనిస్తారు. ఈ విదంగా మీ డైట్ ని 3 నెలలు పాటించినట్లు అయితే మంచి ఫలితాన్ని గమనిస్తారు.

Leave a Comment