పండ్లు ఎప్పుడు తింటే మంచిది? ఏ సమయం లో తినాలి? Best Time To Eat Fruits in Telugu

పండ్లు ఎప్పుడు తింటే మంచిది అంటే! ఫ్రూట్స్ నేచర్ యొక్క గిఫ్ట్, 90% ప్రజలు ఫ్రూట్స్ ని తప్పుగా తింటూ ఉంటారు దీని వల్ల వాళ్లకి పండ్ల నుండి సరిగా న్యూట్రిషన్ అందదు. దాంతో పాటు డైజెస్టివ్ సమస్యలు, స్కిన్ ఎలెర్జి, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలను ఎదుర్కుంటారు. బాధపడాల్సిన విషయం ఏంటి అంటే మంచి మంచి ఫ్రూట్స్ ప్రజలు తిన్నప్పటికీ వాటి నుండి వచ్చే మంచి మంచి బెనిఫిట్స్ ని పొందలేకపోతున్నారు. అందుకే ఇప్పుడే తెలుసుకోండి పండ్లు ని ఎలా తినాలి మరియు ఎప్పుడు తినాలి , ఏ పండ్లు తింటే మంచిదో? హెల్తీ అజుస్టర్ తెలుగు

ఫ్రూట్స్ లో అనేక రకాల మంచి పోషణాలు కలిగిన న్యూట్రిఎంట్స్ ఉంటాయి. మీరు హెల్తీ గా ఉండాలి అంటే కచ్చితంగా ఫ్రూట్స్ ని తినాల్సిందే, ఫ్రూట్స్ నుంచి మంచి ఆరోగ్యం వస్తుంది కాబట్టి చాలా మంది ఫ్రూట్స్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటూ ఉంటారు, దాని వల్ల వాళ్ళు అనేక రకాలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా రోజు ఫ్రూట్స్ తింటున్నప్పటికీ విటమిన్ కొరత తో బాధపడుతుంటారు, దాని వల్ల క్యాల్షియం , మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ని వాడుతుంటారు. అందుకే పండ్ల నుండి అన్ని పోషకాలను పొందాలి అంటే ఇప్పుడు చెప్పే ఈ 5 ప్పద్దతులని కచ్చితంగా పాటించండి. ఈ పద్ధతులు పండ్ల ని ఎప్పుడు తినకూడదు , పండ్ల ని ఏ సమయం లో తినకూడదు తెలుసుకుంటారు.

1. పండ్ల ని భోజనం చేశాక తినడం
2. పండ్లు ని కట్ చేసి స్టోర్ చేసుకోవడం
3. లోకల్ లో దొరికే పండ్ల ని తినకపోవడం
4. ఫ్రూట్ జ్యూస్ తాగడం
5. రాత్రి పూట పండ్లు ని తినడం
6. పండ్లు ని ఎప్పుడు తినాలి?
7. పండ్లు ని ఎలా తింటే మంచిది?
8. ఏం పండ్లు తింటే మంచిది?

ఆయుర్వేదం ప్రకారం పండ్ల ను ఈ 5 పద్దతుల ద్వారా ఎలా తినకూడదో తెలుసుకోండి

పండ్లు ఎప్పుడు తింటే మంచిది? ఎలా తినాలి?

1. పండ్ల ని భోజనం చేశాక తినడం

మనకు భోజనం చేశాక ఏదైనా తినాలి అనిపిస్తుంది. అందుకే అప్పుదు ఎక్కువగా పండ్ల ని తింటారు. ఇలా బోజనం తిన్న వెంటేనే ఫ్రూట్స్ తింటే మీ డైజెస్టీవ్ సిస్టమ్ కి సమస్యలు వస్తాయి. పండ్లు అనేది తొందరగా జీర్ణం అయిపోతుంది. అప్పుడు మీరు తిన్న బోజనం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దాని వల్ల అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఇలా బోజనం తిన్న వెంటనే పండ్లు తింటే రెండు కలిసిపోయి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీశకుంటుంది, అంతేకాకుంది తిన్న ఫుడ్ కూడా పాడవడం మొదలవుతుంది. ఈ మాటలు మీరు ఎప్పుడు వింటూ ఉంటారు : కమలాలు తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది అని , అరటి పండు బాత్రూమ్ ప్రెసర్ పెంచుతుంది అని. బోజనం తర్వాత తింటేనే ఈ విధంగా ఉంటుంది. కాబట్టి బోజనం తిన్న వెంటనే ఫ్రూట్స్ ని తినకండి.

2. పండ్లు ని కట్ చేసి స్టోర్ చేసుకోవడం

ఇప్పుడున్న కాలం లో చాలా మంది పండ్లు ని కట్ చేసి ఫ్రీడ్జ్ లో పెట్టుకోవడం లేదా ఫ్రూట్స్ ని కట్ చేసి ఆఫీసు కి తీసుకెళ్లడం వంటివి చేస్తున్నారు. ఇలా పండ్లు ని కట్ చేసి స్టోర్ చేసుకోవడం వల్ల వాటిలో ఉండే న్యూట్రీషన్ మొత్తం పోయి పాడయిపోతుంది. ఒకసారి ఫ్రూట్స్ ని కట్ చేసిన 20 నిమిశాలలో వాటిని తినేయాలి, లేకుంటే అవి చిన్న గా పాడయిపోతుంది. ఇలా పాడయిపోయిన ఫ్రూట్స్ ని తినడం వలన అసిడిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ధీని వల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ అనేది వస్తుంది [ స్కిన్ ప్రాబ్లం , జుట్టు రాలిపోవడం]. మీరు పండ్లు ని స్నాక్ గా తీస్కోవడం చాలా మంచిది కానీ మొత్తం ఫ్రూట్ ని తినండి. దీని వల్ల పండ్లు లో ఉండే అన్నీ పోషకాలు పొందవచ్చు.

3. లోకల్ లో దొరికే పండ్ల ని తినకపోవడం

ఈ మద్య కాలం లో విదేశీ పండ్లు ని తినడానికి ఎక్కువ ఇస్తాపడుతున్నారు, ఎందుకంటే అందులో ఎక్కువ పోషణాలు ఉంటాయి అని, కానీ ఆవి తినడం కన్నా మన లోకల్ లో దొరికే పండ్లు ని తినడం వళ్ళే ఎక్కువ లాభం కలుగుతుంది. మీ శరీరం కి న్యూట్రీషన్ మన లోకల్ లో దొరికే పండ్ల వలనే దొరుకుతుంది. విదేశం నుంచి వచ్చే ఫ్రూట్స్ విదేశీ వాళ్ళకే సెట్ అవుతుంది. నిజంగానే విదేశీ ఫ్రూట్స్ లలో కివీస్ , బెర్రీస్ , అవకాడో వంటి ఫ్రూట్స్ లో మంచి న్యూట్రీషన్ ఉంటుంది కానీ ఇది ఎక్కువ రేట్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఎక్కడైతే న్యాచురల్ గా పండుతాయో అక్కడి వాళ్ళకే ఇది సెట్ అవుతుంది. మనకు అరటిపండు, కమలాలు, బొప్పాయి, మామిడి వంటి సీసనల్ పండ్లు తింటే చాలా మంచిది. అంతేకాకుండా మనకు సరిపోయేంత న్యూట్రీషన్ కూడా ఇందులో ఉంటుంది. అందుకే ఏ ఫ్రూట్ అయితే సీసనల్ లో దొరుకుతుందో వాటిని కచ్చితంగా తినండి.

4. ఫ్రూట్ జ్యూస్ తాగడం

చాలా మంది ఫ్రూట్స్ తినడం కన్నా ఫ్రూట్ జ్యూస్ తాగడానికి ఇష్టపడుతుంటారు. ఫ్రూట్ జ్యూస్ తాగడం మంచిదే కానీ పండ్లు తింటే ఇంకా మంచిది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, ముక్యంగా ఫ్రూట్ జ్యూస్ తాగడం వలన ఫ్రూట్ లో ఉండే డైటరీ పైబర్ ని కోల్పోతారు. ఈ డైటరీ పైబర్ మన శరీరం లో డైజెస్టివ్ సిస్టం కి బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఫ్రూట్స్ లో నాచురల్ గానే షుగర్ క్వాంటిటీ ఉంటుంది. ఫ్రూట్స్ జ్యూస్ తాగడం వల్ల అందులో ఎక్స్ట్రా గా షుగర్ ని ఆడ్ చేస్తారు. షుగర్ ఆడ్ చేసిన జ్యూస్ తాగడం వలన బరువు పెరగడానికి కారణం అవుతుంది. అందుకే ఎప్పుడైనా సరే ఫుల్ ఫ్రూట్ ని తినడానికి ట్రై చేయండి. డైరెక్ట్ ఫ్రూట్ ని తినడం వలన అందులో ఉండే అన్ని పోషకాలు మన శరీరానికి గ్రహించబడతాయి. ఫ్రూట్ ని జ్యూస్ చేయడం వల్ల అందులో ఉండే విటమిన్స్, న్యూట్రిషన్ మొత్తం కోల్పోతుంది. జ్యూస్ ని అప్పుడు అప్పుడు తాగడానికి ట్రై చేయండి.

5. రాత్రి పూట పండ్లు ని తినడం

పండ్లు ఎప్పుడు తింటే మంచిది అంటే! చాలా మంది పండ్లు మంచి ఆరోగ్యం కాబట్టి ఏ టైమ్ లో అయినా ఫ్రూట్స్ తినవచ్చు అని అనుకుంటున్నారు. కానీ అది తప్పు, ఆయుర్వేదం ప్రకారం సూర్యాస్తమయం అయిన తర్వాత పండ్లు ని తినకూడదు. ఎందుకంటే ఫ్రూట్స్ తినడం వల్ల మనకి చలువ చేస్తాయి కాబట్టి రాత్రి పూట పండ్లు తినడం వలన డైజెస్టీవ్ ప్రాబ్లం వచ్చి అసిడిటీ గా మారుతుంది. అందుకే ఫ్రూట్స్ ని 6 గంటల లోపే తినడానికి ట్రై చేయండి.

ఇప్పుడు ఫ్రూట్స్ ని ఎలా? ఏ విధంగా? ఏ సమయం లో తింటే మంచిదో తెలుసుకుందాం

పండ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

1. పండ్లు ని ఎప్పుడు తినాలి?

పండ్లు ని ఉదయాన్నే పరకడుపున తింటే చాలా మంచిది. అందుకే బ్రేక్ఫాస్ట్ కి ముందు పండ్లు ని తినడం అలవాటు చేసుకోండి. ఇలా తినడం వలన మీ శరీరం లో ఉండే టోక్సిన్స్ తగ్గించుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ ని ఎప్పుడైనా బోజనం తినడానికి 2 గంటల ముందు లేదా 2 గంటల తర్వాత నే తినండి.

2. పండ్లు ని ఎలా తింటే మంచిది?

మనం ముందు చెప్పినట్లుగానే పండ్ల జ్యూస్ నే కాకుండా ఫ్రూట్ మొత్తాన్ని తినండి. ఇలా తినడం వలనా అందులో ఉండే అన్నీ పోషణాలు మనకు అందుతుంది. ఒకవేళ ఫ్రూట్ జ్యూస్ తాగాలి అనిపిస్తే చిన్నగా సిప్ చేసుకుంటూ తగండి.

3. ఏం పండ్లు తింటే మంచిది?

ఎప్పుడైనా సరే మీ పరిసరాలలో దొరికే పండ్ల ని మరియు సీసనల్ పండ్లు ని తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన పరిసారలో దొరికే పండ్లు కె మన శరీరానికి సరిపడెంత పోషకాలు ఉంటాయి.

ముగింపు

ఈ విధంగా పండ్లు ఎప్పుడు తింటే మంచిది అని తెలుసుకున్నారు కదా! ఇప్పుడు చెప్పిన పద్దతులను కచ్చితంగా పాటించండి. మీ హెల్త్ ఆరోగ్యంగా ఉండాలి అంటే పండ్లు ని తింటే సరిపోదు వాటిని సరైన పద్దతిలో కూడా తినాలి. అప్పుడే వాటిలో ఉండే మంచి పోషకాలు మన శరీరానికి అందుతుంది. మన పరిసరాలలో ఉండే పండ్లు ని తినడానికి ఎక్కువ గా ట్రై చేయండి, ఎందుకంటే వాటిలోనే మనకి సరిపడా పోషకాలు ఉంటాయి. పైన చెప్పనా పండ్లు ఎలా తినాలి? ఎప్పుడు తినాలి? అని పద్దతులు పాటిస్తారు అని నమ్ముతూ ధన్యవధములు.
Also Read : కంటి సంరక్షణ కోసం మంచి చిట్కాలు Recommend : ఉదయాన్నే పండ్లు తింటే ఆరోగ్య ప్రయోజలు

1 thought on “పండ్లు ఎప్పుడు తింటే మంచిది? ఏ సమయం లో తినాలి? Best Time To Eat Fruits in Telugu”

Leave a Comment