డిప్రెషన్ & ఆంగ్జైటీ నుంచి బయటపడటానికి సహజ మార్గాలు: నా అనుభవం ఆధారంగా

మనకు డిప్రెషన్ లేదా ఆంగ్జైటీ వచ్చిందంటే ఇది ఏమీ చిన్న విషయం కాదు. కానీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ సమస్యలు సెలబ్రిటీలు సహా ఎంతోమందిని ఎదుర్కొన్నవే. నిజంగా చూస్తే ఇది ఒక్కోసారి మన జీవితంలో కొత్త దిశ చూపించే అవకాశం కూడా అవుతుంది.

నా వ్యక్తిగత అనుభవం

నాకు కూడా కొన్ని సంవత్సరాల క్రితం డిప్రెషన్, ఆంగ్జైటీ వచ్చాయి. అప్పట్లో ఏమీ ఆశ కనిపించలేదు. నిద్ర లేకుండా, ఏం చేయాలో అర్థం కాక, నెమ్మదిగా జీవితం మన చేతుల్లో నుండి జారిపోతున్న ఫీలింగ్… అదే టైంలో కొన్ని చిన్న మార్పులు నా జీవితం మార్చేశాయి. ఈ బ్లాగ్ లో నేను వాటినే మీతో పంచుకుంటున్నాను.

శరీరాన్ని శుభ్రంగా ఉంచడం ఎందుకు అవసరం?

డిప్రెషన్ టైంలో బాత్ చేయాలనే మనసే ఉండదు. కానీ మన శరీరం 72% నీటితో తయారై ఉంటుంది కాబట్టి, నీటి తత్వంతో మమేకం అవ్వడం మన మైండ్ ని రిలీఫ్ చేస్తుంది. నేను రెండుసార్లు స్నానం చేసేవాడిని. మీరు కనీసం ఒక్కసారి అయినా తప్పకుండా స్నానం చేయండి.

వాటర్ మెమరీ: నీటిని చార్జ్ చేయడం

పాజిటివ్ థాట్స్ తో నీటిని 15 సెకన్లు చూస్తూ తాగితే అది మన మైండ్ పై నెగటివ్ ఎనర్జీ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు సైన్స్ కూడా దీన్ని అంగీకరిస్తోంది.

ఆహారమే ఔషధం

మీరు తినే ఆహారం మైండ్ పై ప్రభావం చూపుతుంది. తాంసిక భోజనాలు ఎక్కువగా తీసుకుంటే మన మైండ్ తీవ్రంగా ప్రభావితమవుతుంది. నేను ఎక్కువగా సాత్విక ఆహారం తీసుకునేలా చూసుకున్నాను. ఇది మైండ్ కి ఓ శాంతిని ఇచ్చింది.

మెడిసిన్ తీసుకోవాలా?

ఆన్‌టై డిప్రెసెంట్స్ తాగడం ఓ శాశ్వత పరిష్కారం కాదు. కొద్దికాలం ఉపశమనం ఇస్తాయి కానీ డిపెండెన్సీ పెరిగిపోతుంది. నేను కొన్ని ఆయుర్వేద మందులు మాత్రమే తీసుకున్నాను, సైడ్ ఎఫెక్ట్స్ లేని.

పంచతత్వాల అనుసంధానం

పృధ్వి తత్వం (భూమి)తో మమేకం కావడానికి మట్టిలో ఆడడం, ప్రకృతిలో టైమ్ గడపడం చాల బాగా పని చేస్తుంది. సూర్యుడు తగలడం వల్ల డిప్రెషన్ తగ్గుతుందని కూడా పరిశోధనలు చెప్తున్నాయి.

శ్వాస వ్యాయామం & ధ్యానం

ప్రాణాయామం (అనులోమ విలోమ, భ్రామరీ), ధ్యానం మన మెదడుని స్టేబిలైజ్ చేస్తాయి. రోజుకి కనీసం 10 నిమిషాలు అయినా శ్వాస మీద ఫోకస్ చేయండి.

మ్యూజిక్ థెరపీ

ఇన్స్రుమెంటల్ మ్యూజిక్ మన మైండ్ పై ఇంస్టంట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మ్యూజిక్ మీ ఫీలింగ్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. నేను ఒక ప్లేలిస్ట్ రెడీ చేసుకొని ప్రతి రోజు వింటున్నాను.

ఇన్‌స్పిరేషనల్ కంటెంట్ చూడండి

టీవీ, సోషల్ మీడియాలో నెగటివ్ కంటెంట్ కన్నా స్పిరిటువల్, బయోగ్రఫీ టైప్ కంటెంట్ చూస్తే మైండ్ శాంతిగా ఉంటుంది.

Also Read: హైట్ పెరగాలంటే ఈ ఆరు స్టెప్స్ తప్పనిసరి: 21 ఏళ్లలోపు ఉంటే మీరు తప్పక పాటించాలి

నిత్య జీవన శైలి మార్పులు

ఉదయాన్నే లేవడం, మసాజ్ చేయడం, రోజూ కొంత సమయం నడకకి వెళ్లడం, కొత్త పనులపై దృష్టి పెట్టడం వంటి మార్పులు మీ డిప్రెషన్ నుంచి మెల్లగా బయటకు తీస్తాయి.

ముగింపు

డిప్రెషన్ ఓ దీవెనగా కూడా మారవచ్చు. కొంతకాలం తర్వాత మీరు ఈ ఫేజ్ ని గుర్తు చేసుకుని… “ఈ అనుభవం లేకపోతే నేను ఇవన్ని నేర్చుకోలేనేమో” అనుకుంటారు. అందుకే ధైర్యంగా ఎదుర్కొండి. మీరు ఒంటరి కారు.

గమనిక

ఈ బ్లాగ్‌లో ఉన్న సమాచారం రచయిత వ్యక్తిగత అనుభవం, సంప్రదాయ ప్రాథమికాలు మరియు ఆహార సంబంధిత సాధారణ అవగాహన ఆధారంగా మాత్రమే అందించబడింది. ఇందులో పేర్కొన్న పద్ధతులు లేదా సూచనలు ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా పనికొచ్చేలా ఉండకపోవచ్చు. మీ శరీర పరిస్థితి, జీవన శైలి, ఆరోగ్య స్థితిని ఆధారంగా మీరు అనుసరించాల్సిన మార్గం భిన్నంగా ఉండవచ్చు. కావున మీరు ఈ సమాచారాన్ని అనుసరించే ముందు, ఎప్పటికప్పుడు అనుభవజ్ఞుడైన ఆరోగ్య నిపుణుడి లేదా డాక్టరు సలహా తీసుకోవడం మంచిది.

Leave a Comment