పరిచయం
హెయిర్ ఫాల్ మరియు హెయిర్ థినింగ్ అనేవి చాలామంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలు. చాలామంది మార్కెట్లో ఉన్న అనేక ప్రొడక్ట్స్ ట్రై చేసి అలసిపోయారు. కానీ ఈ సమస్యను పూర్తిగా నివారించాలంటే కేవలం హోమ్ రిమెడీస్ చాలదు, కావున ఒక ప్రాక్టికల్ మరియు కట్టుదిట్టమైన ప్లాన్ అవసరం.
ఈ బ్లాగ్‌లో నేను మీతో షేర్ చేయబోతున్న 3 స్టెప్ ఆయుర్వేదిక్ రొటీన్ ద్వారా మీరు జుట్టు సమస్యల నుండి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు.
1. ఉదయమే శక్తివంతమైన పోషకం: కరువేపాకు మరియు రాగి నీరు
ఉదయం లేవగానే మీరు బ్రష్ చేయకముందే రాత్రంతా రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగండి. ఇది కాపర్, ఐరన్ ను శరీరానికి అందించి జుట్టు ఫాలికల్స్ ను బలపరుస్తుంది.
అంతటితో ఆగకండి, ఫ్రెష్ అయిన తర్వాత మూడు నుండి ఐదు కరువేపాకు ఆకులను బాగా నమలుతూ తినండి. వీటిలో ఉండే బీటా కేరోటిన్, ఆంటీ ఆక్సిడెంట్స్, ఎమినో ఆమ్లాలు జుట్టుకు అవసరమైన పోషకాలు అందిస్తాయి. ఫలితంగా హెయిర్ ఫాల్ మరియు థినింగ్ సమస్య తగ్గుతుంది.
గమనిక: కరువేపాకులో ఉండే రసం అంతా అయిపోయేంతవరకు బాగా నమలాలి. తిన్న తరువాత కనీసం 30 నిమిషాల పాటు ఏమీ తినకుండా ఉండాలి.
2. జుట్టుకు బలమైన పోషణ: మజ్జిగ మసాజ్
ఇది చాలా మంది మర్చిపోతున్న టెక్నిక్. ఉప్పు లేని పుల్లటి మజ్జిగను తలకు అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయాలి. దీనిలో ఉండే లాక్టిక్ యాసిడ్ మరియు ప్రోటీన్లు జుట్టు మూలాలను శుద్ధి చేసి పోషణ కలిగిస్తాయి.
20 నిమిషాల తరువాత చల్లటి నీటితో తలస్నానం చేయండి. వేడి నీటితో చేయకండి, అది జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతుంది. తలకు పూసిన మజ్జిగను శాంపుతో కడుక్కోవాలంటే 100% నాచురల్ షాంపూలను మాత్రమే ఉపయోగించండి. ఏ టాక్సిక్ కెమికల్స్ ఉండకూడదు.
3. నిద్రకి ముందుగా అమలకీ రసాయనంతో శుద్ధి
రాత్రి పడుకోబోయే ముందు, హాఫ్ స్పూన్ తేనితో కలిపి హాఫ్ స్పూన్ అమలకీ రసాయం తీసుకోండి. ఇది శరీరంలో పిత్త దోషాన్ని తగ్గించి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అమలకీ రసాయంని పడుకునే 30 నిమిషాల ముందు తీసుకోవాలి.
సూచన: బెస్ట్ ఫలితాల కోసం డిన్నర్ మరియు అమలకీ రసాయంని మధ్య కనీసం రెండు గంటల గ్యాప్ ఇవ్వండి.
Also Read : Skincare in Telugu: చలికాలం లో చర్మ సంరక్షణ కోసం ఇంటి చిట్కా
రీక్యాప్: 3 స్టెప్ ఆయుర్వేదిక్ హేర్ కేర్ రొటీన్
1. ఉదయం లేవగానే రాగి పాత్రలో ఉన్న నీరు తాగండి
2. ఫ్రెష్ అయిన తరువాత 3 నుండి 5 కరువేపాకు ఆకులను బాగా నమలుతూ తినండి
3. తలస్నానానికి 20 నిమిషాల ముందు ఉప్పు లేని మజ్జిగను తలపైన మసాజ్ చేయండి
4. చల్లటి నీటితో వాష్ చేయండి నాచురల్ షాంపుతో
5. రాత్రి పడుకునే ముందు అమలకీరసాయం తేనితో కలిపి తీసుకోండి
ముగింపు
మీరు ఈ రొటీన్‌ను కనీసం రెండు వారాల పాటు నిష్టగా పాటిస్తే స్పష్టమైన మార్పు కనబడుతుంది. ఇది కేవలం తాత్కాలిక పరిష్కారం కాదు – ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్న శాస్త్రీయ విధానంగా పనిచేస్తుంది.
మీ జుట్టుకు శాశ్వత ఆరోగ్యం కావాలంటే ఈ 3 స్టెప్ ప్లాన్‌ను ఫాలో అవండి.
Disclaimer: ఈ బ్లాగ్ విద్యా మరియు సమాచారం లక్ష్యంగా మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పకుండా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ లేదా ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించండి.

నా పేరు చైతన్య. నేను ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్నాను. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది జంక్ ఫుడ్ మరియు బయట ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. ఈ పరిస్థితిని చూసిన తర్వాత, నిజమైన ఆరోగ్యమే నిజమైన సంపద అనే విషయాన్ని అర్థం చేసుకున్నాను. ఆరోగ్యంగా ఉండేందుకు మనం ఎలా జీవించాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే విషయాలను నేర్చుకుంటూ, వాటిని మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా నిస్సంకోచంగా వాటిని అనుసరించి ఆరోగ్యంగా జీవించవచ్చు. [గమనిక : మీకు మరింత ఎక్కువగా మీ ఆరోగ్యం ప్రమాదం లో ఉంది అనిపిస్తే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి]