రాత్రి ఆలస్యంగా భోజనం తినడం వలన కలిగే నస్టాలు | Side Effects of Late Night Dinner in Telugu

రాత్రి ఆలస్యంగా భోజనం తినడం ఎన్నో అనారోగ్య సమస్యలకు ధారి తీస్తుంది, అందుకే ఆయుర్వేదం ప్రకారం మనం సాయంత్రం 7 లోపు భోజనం చేయాలి. కానీ చాలా మంది ఈ కాలం లో రాత్రి పూట లేట్ గా భోజనం చేస్తుంటారు, ఎందుకంటే ఉద్యోగాలు చేయడం వలన చాల మంది కి తొందరగా భోజనం తినడం వీలు అవ్వదు. అందుకే రాత్రి 9 గంటలకి ఆ సమయం లో భోజనం చేస్తుంటారు. రాత్రి ఆలస్యంగా భోజనం తినడం వలన మన శరీరానికి చాలా సమస్యలు వస్తాయి. కానీ నేను ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటించినట్లు అయితే మీరు సరైన సమయానికి భోజనం చేయొచ్చు. రాత్రి భోజనం ఆలస్యంగా తినడం వలన సమస్యలు ఏంటి? రాత్రి భోజనం త్వరగా తినడం వలన ఆరోగ్య ప్రయియోజనాలు ఏమిటి? రాత్రి భోజనం త్వరగా తినాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెల్తీ అజుస్టర్

ఆయర్వేదం ప్రకారం మన జీర్ణవ్యవస్థ ప్రక్రియ సూర్యుని పై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడయితే సూర్యుడు అధికం అవుతాడో అప్పుడు మన జీర్ణ శక్తీ కూడా పెరుగుతుంది. అలాగే సూర్యుడు అస్తమించే కొద్దీ మన జీర్ణ శక్తీ కూడా తగ్గుతూ వస్తుంది. అందుకే సూర్యాస్తమయం తర్వాత తిన్న ఫుడ్ సరిగా జీర్ణం అవ్వదు. ఇలా జీర్ణం అవ్వని ఆహరం చెడు పదార్ధం గా మారి గ్యాస్ ని విడుదల చేస్తుంది. సైన్టిస్ట్ లు కూడా ఇదే చెప్తున్నారు, భోజనం అనేది రాత్రి పూట త్వరగా తినాలి లేకపోతే సరిగా జీర్ణం అవ్వక టాక్సిన్స్ గా మారి అనేక సమస్యలు వస్తాయి అని. 2013 సంవత్సరం లో ప్రజలను 2 గ్రూప్ గా విభజించారు, రోజంతా ఒకే రకమైన ఆహారం పెట్టారు, కానీ ఒక గ్రూప్ కి ఉదయం ఆహారం ఇచ్చారు, ఇంకొక గ్రూప్ కి రాత్రి ఆహారం ఇచ్చారు. ఆఖరికి తేలింది ఏమిటి అంటే ఏ గ్రూప్ అయితే ఉదయం ఆహారం తిన్నారో వాళ్ళు ఎక్కువ బరువు తగ్గడం జరిగింది. దీనికి కారణం ఏమిటి అంటే! ఎవరైతే రాత్రి పూట భోజనం ఆలస్యంగా తింటారో వాళ్లకి గ్యాస్ , INDIGESTION ,BLOATING ,అసిడిటీ , DISTURBED స్లీప్, వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆయుర్వేద గ్రంధాల ప్రకారం ఎక్కువ ఆరోగ్య సమస్యలు వచ్చేది రాత్రి పూట ఆలస్యంగా ఆహరం తినడం వలన వస్తుంది.

కానీ ఈ కాలం లో ఉండే ప్రజలకు తొందరగా ఆహారం మరియు భోజనం తినడం కుదరడం లేదు దానికి కారణం ఏమిటి అంటే , ఒక స్టూడెంట్ అయితే రాత్రి చదువుకునేటప్పుడు చిప్స్ వంటివి స్నాక్ గా తింటుంటారు, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి అయితే రాత్రి 9 గంటల వరకు చేస్తుంటారు, అంతేకాకుండా రాత్రి పూట కూడా పని చేసేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా పనులలో బిజీ అయిపోవడం వలన సరైన సమయానికి భోజనం చేయడం లేదు. ఆహారం తినడానికి సరైన సమయం ఏమిటి అంటే , ఆయుర్వేదం ప్రకారం మీరు భోజనం 7 గంటల లోపే తింటే మంచిది. కానీ మీకు అలా తినడం కుదరకపోతే ఇప్పుడు చెప్పే ఆరోగ్య చిట్కాలను కచ్చితంగా పాటించండి. ఇది మీకు మరియు మీ జీర్ణ వ్యవస్థ కి బాగా ఉపయోగపడుతుంది.

1. అల్లం మరియు ఉప్పు మిశ్రమం

అల్లం మరియు ఉప్పు మిశ్రమాన్ని మీరు రాత్రి బోజనం చేసేముందు బాగా నమిలి తినండి, అల్లం మరియు ఉప్పు యొక్క మిశ్రమం మీ జీర్ణ శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు బోజనం చేసినా మీకు జీర్ణ శక్తి పెరుగుతుంది కాబట్టి తొందరగా మీరు తిన్న బోజనం జీర్ణం అవుతుంది. సూర్యాస్తమయం తర్వాత మన జీర్ణ శక్తి తగ్గుతుంది కాబట్టి కచ్చితంగా ఆలస్యంగా బోజనం చేసేటప్పుడు ఈ అల్లం మరియు ఉప్పు మిశ్రమాన్ని తినండి. ఇలా తినడం వలన మీ శరీరం లో ఇన్స్టంట్ గా జీర్ణ శక్తి పెరుగుతుంది. అందువల్ల తిన్న ఆహారం తొందరాగా జీర్ణం అవుతుంది.

2. కుడి ముక్కు తో గాలి పీల్చుకోవడం [ Right Nostril Breathing ]

రాత్రి బోజనం చేయడానికి ముందుగా ఈ యోగి క్రియ ను చేయండి. ఇధి చేయడం వలన మీ శరీరం లో ఉండే జీర్ణ వ్యవస్థ నుండి జీర్ణ రసం అనేది విడుదల అయ్యి మీరు తిన్న బోజనం జీర్ణం అవ్వడానికి దోహదపడుతుంది. ఈ యోగి క్రియను సూర్య బేది ప్రాణాయము అంటారు.

  • మీరు ఫ్రీ గా కూర్చొని ఎడమ వైపు ముక్కును మూసుకొని కుడి ముక్కు నుంచు గాలి పీలచండి, పీల్చి 2 సెకండ్స్ గాలిని అలానే ఉంచుకొని తర్వాత ఎడప వాపు ఉన్న ముక్కు నుంచి గాలి బయటకు వదలండీ. ఈ విధంగా ఒక 10 సార్లు చేసి భోజనం చేయండి. ఇలా చేయడం వలన మీ జీర్ణ శక్తి పెరిగి మీరు తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.

రాత్రి ఆలస్యంగా భోజనం తినడం వలన కలిగే ఆరోగ్య సమస్యలు

మీరు ఆలస్యంగా భోజనం చేస్తునట్లు అయితే ఈ రెండు పద్దతులను కచ్చినతంగా పాటించండి. ఇవి పాటించనడం వల్ల మీకు ఎన్నో ఆరోగ్య ఇబ్బందుల నుండి బయటపడొచ్చు. ఇలా చేయడం వలన గ్యాస్ , అసిడిటీ, bloating వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. రెండు పద్దతులు చేయడం కుదహారకపోతే కచ్చితంగా ఒక్కటైన పాటించండి. ఈ పద్దతి పాటించిన తర్వాత హ్యాపి గా భోజనం చేయండి. భోజనం చేసేటప్పుడు ఫోన్లు, టివి , ల్యాప్టాప్ లు వంటివి చూడకుండా, మీ పూర్తి దృస్టి మీ భోజనం పై ఉంచి తినండి. ఇలా తినడం వలన మీరీ తిన్న ఆహారం కూడా సరిగా మీ శరీరానికి వంటబడుతుంది. అంతేకాకుండా తిన్న భోజనం కూడా సరిగా జీర్ణం అవుతుంది. తిన్న వెంటనే ఎప్పుడైనా సరే అప్పుడే పడుకోకండి. తిన్న తర్వాత కనీసం ఒక 10 నిమిషాలు అయిన నడవండి. లేకపోతే ఒక పది నిమిషాలు వజ్రాసనం వేయండి. వజ్రాసనం వేయడం వల్ల రక్త ప్రసరణ ఉదరం వైపు పెరిగి బాగా తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి దోహదపడుతుంది. తిన్న తర్వాత మీరు వజ్రాసనం వేసుకొని టీవీ లేదా ఇతరులతో మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైనా సరే తిన్న వెంటనే పాడుకోకండి. ఆహారం తిన్న 2 గంటల తర్వాత నిద్రపోవడం మంచిది. పడుకునేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకోండి. ఎందుకంటే ఇలా పడుకోవడం వలన మీ కుడి ముక్కు కి బాగా గాలి పీల్చుకోడానికి వీలుంటుంది. కుడి ముక్కు బాగా పనిచేయడం వలన జీర్ణ రసం విడుదల అయ్యి జీర్ణ శక్తీ ని పెంచుతుంది. అంతేకాకుండా మనం కుడి వైపు పడుకుంటే శరీరం లో ఉండే ఆసిడ్స్ అనేది పైకి రావు. అసిడిటీ సమస్య ఉన్న వాళ్ళు కచ్చితంగా ఎడమ వైపు పడుకోండి.

మీరు రాత్రి పూట ఆలస్యంగా ఆహారం తినే ముందు అల్లం మరియు ఉప్పు మిశ్రమం కచ్చితంగా తీసుకోండి. దాని తర్వాత 10 సార్లు కుడి ముక్కు తో గాలి ని పీల్చుకొండి. తినే అన్నాన్ని సరిగా సంతృప్తి గా తినండి. అప్పుడే తిన్న అన్నం మీ వంటికిపడుతుంది. మీరు తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు నడవడం కానీ లేదా వజ్రాసనం వేయండి. రాత్రి తిన్న 2 గంటల తర్వాతే పడుకోండి. ఇంకా ఎడమవైపు తిరిగి పడుకోండి.

ముగింపు

రాత్రి భోజనం ఆలస్యం చేయడం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. జీర్ణశక్తి సూర్యుడిపై ఆధారపడి ఉండటంతో, భోజనం 7 గంటలలోపు చేయడం ఆరోగ్యానికి మంచిది. ఆలస్యంగా భోజనం చేయాల్సిన పరిస్థితుల్లో, అల్లం-ఉప్పు మిశ్రమం తీసుకోవడం లేదా సూర్య బేది ప్రాణాయామం చేయడం ఉపయోగకరం. భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం లేదా వజ్రాసనం వేయండి. తిన్న ఆహారం శరీరానికి అనుకూలంగా ఉండేందుకు ఇవి ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు.
Also Read : పండ్లు ఎప్పుడు తింటే మంచిది? ఏ సమయం లో తినాలి?

Leave a Comment