కంటి సంరక్షణ కోసం మంచి చిట్కాలు – Eye Care Tips at Home in Telugu

కంటి సంరక్షణ కోసం ఈ చిట్కాలను పాటించండి. కళ్ళు మన బాడీ లో చాలా డెలికేట్ ఆర్గాన్ కళ్ళు లేకుండా మన లైఫ్ ని ఊహించుకోవడం చాలా కష్టం కానీ మనకి తెలిసో తెలియకో మనం చేసే పనుల వలన మన కంటి కి ప్రాబ్లం కలగవచ్చు దానితో కళ్ళ సైట్ వీక్ అవుతుంది. ఈ కాలం లో కంటి చూపు పెంపుదల కోసం అనేక రకాల చిట్కాలు పాటించాలి , ఎందుకు అంటే ఈ కాలం లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువ స్మార్ట్ ఫోన్ వలన కంటి సమస్యలు వస్తున్నాయి. అంధువలన కింద చెప్పే కంటి సంరక్షణ చిట్కాలను పాటించండి.

రోజువారీ ఈ 5 అలవాట్ల వలన మీకు కంటి సమస్యలు పెరుగుతాయి

కంటి సంరక్షణ పద్దతులు

1. స్క్రీన్స్ ఎక్కువ చూడడం వలన కంటి సమస్యలు

ఎక్కువగా స్క్రీన్ టైం గత పది సంవత్సరాల కాలంలో కళ్ళజోడు ధరించే టీనేజ్ సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది దీనికి కారణం అందరికీ తెలిసిందే ఎక్కువగా టీవీ, కంప్యూటర్, మొబైల్ చూడడం ఈ స్క్రీన్ వైపు అదే పనిగా చూడడం వలన మన ఐస్ డ్రై అవుతాయి డెడ్ స్కిన్ సెల్స్ ఫేస్ పై చేరుతాయి డెట్ సెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం వలన డార్క్ సర్కిల్స్ వస్తాయి ఐ సైట్ కూడా వీక్ అవుతుంది. ఈ విధంగా స్మార్ట్ ఫోన్ వలన కంటి సమస్యలు, కంప్యూటరు వలన దృష్టి సమస్యలు వస్తాయి.

మనలో చాలామంది జాబ్స్ కూడా అలాగే ఉన్నాయి కంప్యూటర్స్ ముందు కూర్చోవాల్సి వస్తుంది అయినప్పటికీ కొన్ని స్టెప్స్ ఫాలో అయిన కంప్యూటర్స్ ని కొంచెం అవాయిడ్ చేయవచ్చు ఎలా అంటే వాటర్ తాగడం కోసం వెళ్లవచ్చు అప్పుడు కళ్ళు కొంచెం స్ట్రెస్ ఫ్రీగా అవుతాయి అంతేకాకుండా వాటర్ తాగడం వలన కళ్ళు డ్రైనస్ తగ్గుతుంది

2. కళ్ళని ఎక్కువగా రుద్దడం వలన కంటి సమస్యలు

మన కళ్ళు చాలా డెలికేటెడ్ గా ఉంటాయి, ఎవరైతే కళ్ళు నలుపుకుంటారో వాళ్లకి తెలియకుండా కళ్ళ కింద ఉన్న మజిల్స్ ని డామేజ్ చేసుకుంటారు, అంతేకాకుండా మన చేయి శుభ్రం లేకుంటే క్రిములు కళ్ళ పైకి చేరుతాయి దానితో ఇరిటేషన్ దురద వంటివి వస్తాయి. అప్పుడు కంటి సమస్యలు అనేది ఇంకా పెరుగుతుంది. కంటి సంరక్షణ గా ఉండాలి అంటే ఈ పనులు అస్సలు చేయకండి.

3. ప్రయాణం చేసేటప్పుడు చదవడం

ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మనం చదివితే మన కళ్ళపై చాలా స్ట్రెస్ పడుతుంది ఎందుకు అంటే ఏ టెక్స్ట్ అయితే మనం చదువుతాము అది కదులుతూనే ఉంటుంది అప్పుడు దానిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది ఈ కాలంలో బుక్స్ ప్లేస్ లో ఫోన్స్ వచ్చాయి ఫోన్స్ లో చాటింగ్ చేస్తుంటాము ఫోన్ లో ఉండే లెటర్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి ఇలా చేయడం వలన కళ్ళ సైట్ స్లోగా తగ్గుతుంది, స్మార్ట్ ఫోన్ వలన కంటి సమస్యలు పెరుగుతాయి. అందుకే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు గతుకుల రోడ్లపై ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అవసరం లేని చాటింగ్ ను చేయకండి ఇలా అవాయిడ్ చేయడం మంచిది.

4. కళ్ళకు UV రక్షణ గ్లాసస్ వేసుకోవడం

కంటి చూపు సుదీర్గం చేసుకోవడం ఎలా అంటే ! సన్ గ్లాసెస్ ని వేసుకోకపోవడం సన్ గ్లాసెస్ కేవలం స్టైల్ కి మాత్రమే కాదు కంటి సంరక్షణకు ఉపయోగపడుతుంది. ఎక్కువగా యూవీ రేస్ కళ్ళపై పడితే కార్నియా డామేజ్ అవుతుంది అందుకే మంచి క్వాలిటీ సన్ గ్లాసెస్ వాడాలి. ఈ సన్ గ్లాసెస్ వాడడం వలన యు వి రేస్ నుండి 100% ప్రొటెక్షన్ పొందవచ్చు.

5. తక్కువ లైట్ లో చదవడం

తక్కువ లైట్లో చదవడం, ఇంట్లో పెద్దవాళ్లు మనకు టేబుల్ లాంప్ పెట్టుకోమని చెప్తారు, ఆ తక్కువ కాంతిలో చదవడం వలన మన కల్లా మజిల్ పై చాలా ఒత్తిడి పడుతుంది దానితో ఐస్ స్లోగా వీక్ అవుతుంది ఒకవేళ రాత్రులు రూమ్ లో లైట్ ఆఫ్ చేసి మొబైల్ ని వాడుతుంటే మన కళ్ళు త్వరగా డామేజ్ అవుతాయి అందుకే కళ్ల మజిల్స్ ని ఒత్తిడి చేయకుండా కాంతి లోనే చదువుకోవాలి. కంటి ని సంరక్షణ గా చూస్కోవాలి.

5 కంటి వ్యాధుల నివారణ చిట్కాలు

కంటి సంరక్షణ విధానము మరియు సమస్యలు

1. కంటి ఆరోగ్యం కోసం ఆహారం

  • మన కళ్ళు చాలా కాలం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మన రోజువారి ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు కలపాలి అన్ని ఆకుకూరలలో Zeaxanthin and Lutein అధికంగా ఉంటాయి ఇవి కళ్ళకి మంచి న్యూట్రిషన్ అందిస్తాయి.
  • క్యారెట్లు విటమిన్ ఏ మరియు బెటా కారుటీన్ ఉంటాయి వాటిని సలాడ్స్ లేదా జ్యూస్ లాగా చేసుకోవచ్చు
  • ఉసిరిలో అధికంగా విటమిన్ సి ఉంటుంది అది కళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది రోజులో ఒక ఉసిరిని అయినా తప్పకుండా తినాలి ఇలా చేయడం కంటి సంరక్షణకు మంచిది.
  • ఇవే కాకుండా ఒమేగా 3 కలిగిన ఆహార పదార్థాలను అంటే ఒకటి లేదా రెండు వాల్నట్స్ రోజు నానబెట్టుకుని తినాలి, పెసరపప్పు కళ్ళకు చాలా మంచిది, సాల్ట్ ని ఎక్కువగా తినడం వలన కంటికి ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి.

2. కంటి మజిల్స్ సంరక్షణ

మనం మన బాడీలో ఉన్న అన్ని మజిల్స్ ని ఎక్ససైజ్ చేస్తాము, మరి కంటి మజిల్స్ ని ఎలా చేయాలి అంటే కొన్ని ఎక్సర్సైజ్ ప్రతిరోజు మూడు నుంచి ఐదు నిమిషాలు చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి.

  • ముందుగా కనుగుడ్లను గుండ్రంగా తిప్పడం . స్టార్టింగ్ లో స్లోగా చేయాలి 30 సెకండ్లు అయితే చాలు
  • టూ టైమ్స్ అయిని గట్టిగా క్లోస్ చేసుకుని మూడు సెకండ్లు హోల్డ్ చేసి తరువాత కళ్ళని ఓపెన్ చేయాలి
  • మూడవది చాలా సింపుల్ మన చేతులను బాగా రుద్ది మన కళ్ళపై పెట్టాలి అప్పుడు మన కంటి మజిల్స్ రిలాక్స్ అవుతాయి.

3. కంటి ని శుభ్రంగా కడగడం

ఒక మంచి అలవాటుని మనం నేర్చుకోవాలి ఫేస్ వాష్ చేసేటప్పుడు నోటిలో వాటర్ ని ఫుల్ గా నింపాలి తర్వాత కళ్ళని ఫ్రెష్ వాటర్ తో వాష్ చేయాలి నోటితో వాటర్ నింపడం వలన కంటి ఏరియా ఎక్స్పెండ్ అవుతుంది. దానితో బాగా క్లీన్ గా చేసుకోవచ్చు.

  • ఐ వాష్ రొటీన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే ఐ వాష్ కప్పులో 10 డ్రాప్స్ రోజ్ వాటర్ వేసి తర్వాత నార్మల్ వాటర్ నింపాలి తర్వాత ఆ కప్పుని మన కంటి పై పెట్టి కనుగొడ్లను అటు ఇటు తిప్పాలి ఇది ఐ సైట్ ని పెంచి కంటి కి ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉండేలా చూస్తుంది.

4. రెగ్యులర్ కంటి సంరక్షణ చికిత్సా

మన బాడీలో కళ్ళు చాలా డెలికేటెడ్ పార్ట్ అని మనకు బాగా తెలుసు అందుకే వీటికి రెగ్యులర్ చెకప్ అవసరం. సంవత్సరంలో ఒకసారి అయినా చాలు, కంటి చెకప్ అంటే ఐ స్పెషలిస్ట్ దగ్గర చూపించుకోవాలి.

5. కంటి సంరక్షణ కు ఇంటి చిట్కా

  • ఈ హోమ్ రెమిడి కి కావాల్సింది బాదంపప్పు, సోంపు, పటిక బెల్లం ఈ మూడు ఐటమ్స్ సరిపడా తీసుకొని బాగా గ్రైండ్ చేయాలి
  • ఈ పౌడర్ ని ఎయిర్ టైట్ క్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ ఈ పౌడర్ ని తిని ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగాలి. దీనిని మూడు నెలలు క్రమంగా చేస్తే కచ్చితంగా మంచి రిజల్ట్స్ చూడవచ్చు
  • ఒకవేళ వయస్సు 13 కన్నా తక్కువ ఉంటే ఒక స్పూన్ పౌడర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇలా చేస్తే చాలా మంచిది
  • మన కంటి నీ కేర్ చేయడం చాలా ముఖ్యం ఎలా చేస్తే మన కళ్ళు చాలా హెల్తీ గా ఉంటాయి.

ముగింపు

ఈ విధంగా మీరు మీ కంటి సంరక్షణ చిట్కాలను పాటించండి. కళ్ళు అనేది మనకి చాలా అవసరం, అంతే కాకుండా చాలా సెన్సిటివ్ గా కూడా ఉంటుంది. అందుకే కంటి సంరక్షణకు ఎన్నో చిట్కాలను పాటించాలి. మీరు కూడా కచ్చితంగా పైన చప్పిన కంటి చిట్కాలను పాటించండి. శుభ్రంగా ఉంచుకోండి. ధన్యవధములు..
Also Read : బరువు తగ్గడానికి చిట్కాలు మరియు రెసిపీలు మరిన్ని హెల్త్ చిట్కాల కోసం హెల్తీ అజుస్టర్.

2 thoughts on “కంటి సంరక్షణ కోసం మంచి చిట్కాలు – Eye Care Tips at Home in Telugu”

  1. good contant

    Reply

Leave a Comment